ICC Cricket World Cup 2019, India vs West Indies:Technology and umpires are again facing the heat after Rohit Sharma’s controversial dismissal. The ball clearly hit the pads and because the angle was not available, he was given out.
#icccricketworldcup2019
#indvwi
#rohitsharma
#msdhoni
#viratkohli
#rohitsharma
#yuzvendrachahal
#cricket
#teamindia
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను దురదృష్టం వెంటాడింది. రోహిత్ శర్మ 1 ఫోర్, 1 సిక్స్‌తో మంచి టచ్‌లోకి వచ్చిన సమయంలో వివాదాస్పద రీతిలో ఔటయ్యాడు. భారత్ ఇన్నింగ్స్‌లో భాగంగా కీమర్ రోచ్ వేసిన ఆరో ఓవర్ చివరి బంతి రోహిత్ బ్యాట్‌కు, ప్యాడ్‌కు మధ్యలోంచి కీపర్ షాయ్ హోప్ చేతుల్లోకి వెళ్లింది. దీనిపై విండీస్ అప్పీల్‌కు వెళ్లగా ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. అయితే దీనిపై విండీస్ రివ్యూ కోరంగా అందులో భారత్‌కు వ్యతిరేకంగా ఫలితం వచ్చింది. కాగా, ఇది ఔటా..నాటౌటా అనే దానిపై పూర్తిగా స్పష్టత లేని క్రమంలో థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు.