ICC Cricket World Cup 2019:India VS Afghanistan Match Highlights:India Beat Afghanistan By 11 Runs

2019-06-22 711

Mohammed Shami became the second Indian after Chetan Sharma (1987) to claim a hat-trick in ICC World Cup as India beat Afghanistan by 11 runs here on Saturday (June 21). After labouring to 224/8, India bowled out Afghanistan for 213 to celebrate a very close win
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#IndiaVSAfghanistan
#shami
#bhumra
#nabhi
#viratkohli

సౌతంప్టన్ వేదికగా జరుగుతున్న భారత్ వర్సెస్ ఆఫ్గనిస్తాన్ వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. భారత్ విధించిన 225 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో, ఆఫ్గన్ బ్యాట్స్ మెన్ చివరి ఓవర్లో తడబడ్డారు. చివరి ఓవర్లో షమి వరుసగా మూడు వికెట్లతో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టడంతో ఆఫ్గనిస్తాన్ పై భారత్ 11 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించింది. ఆఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ లో ఒక బంతి మిగిలి ఉండగా, 49.5 ఓవర్లకు 213 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇదిలా ఉంటే ఆఫ్గన్ ఓపెనర్లు బ్యాటింగ్ నిలకడగా మొదలు పెట్టినప్పటికీ ఓపెనర్ హజరత్ (10) తక్కువ పరుగులకే ఔటయ్యాడు. అయినప్పటికీ గుల్బదిన్ నయిబ్ (27), రహ్మత్ షా(36), షహీదీ(21) లు రాణించడంతో ఆఫ్గన్ బ్యాట్స్ మెన్ భారత్ విధించిన టార్గెట్ ఛేదన దిశగా కదిలింది. ముఖ్యంగా చివర్లో మహ్మద్ నబి(52) ఒంటరి పోరాటం చేశాడు. చివరి ఓవర్లో ఆఫ్గన్ విజయానికి 16 పరుగుల దూరంలో నిలవగా నబి ఔట్ కావడంతో మ్యాచ్ ఫలితం తారుమారవగా భారత్ విజయం సాధించింది.