ICC Criket World Cup 2019 : Vijay Shankar Participated In Net Practice Yesterday After Injury

2019-06-21 1

Courtesy:@BCCI

ICC Criket World Cup 2019 :India all-rounder Vijay Shankar reportedly walked off the field writhing in pain after being hit on his hand during a training session in London on Friday.
#icccricketworldcup2019
#VijayShanker
#shikardhawan
#bhuvaneshwarkumar
#teamindia
#cricket

టీమిండియా స‌హా భార‌త క్రికెట్ అభిమానుల్లో క‌ల‌క‌లం పుట్టించిన గాయాల బెడ‌ద నుంచి ఆల్‌రౌండ‌ర్ విజ‌య్ శంక‌ర్ కాస్త త్వ‌ర‌గానే కోలుకున్నాడు. జ‌ట్టు స‌భ్యుల‌తో క‌లిసి నెట్ ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గొన్నాడు. విజ‌య్ శంక‌ర్ గాయం బారి నుంచి కోలుకున్నాడని, నెట్ ప్రాక్టీస్‌లో చురుగ్గా పాల్గొంటున్నాడ‌ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు యాజ‌మాన్యం సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. నెట్ ప్రాక్టీస్ సంద‌ర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజ‌య్ శంక‌ర్ షాట్లు ఆడ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. పాదాల క‌ద‌లిక‌ల్లోనూ ఎలాంటి స‌మ‌స్య‌లు లేవ‌ని, తాను మామూలు స్థితికి చేరుకున్న‌ట్లు విజ‌య్ శంక‌ర్ తెలిపాడు.