ICC World Cup 2019:This Is The Reason Why Teamindia Late Entry In World Cup ?

2019-06-03 1,021

The 2019 World Cup has kicked off and is in full flow. The English summer is already looking beautiful and the country seems to be embracing in style with the World Cup at home. It going to get better as the World Cup grows and moves into the latter half.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rohitsharma
#kedarjadav
#jaspritbumrah
#yuzvendrachahal
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ 2019లో ఒక్క భారత్ తప్ప అన్ని జట్లూ మ్యాచ్‌లు వరుసగా ఆడేస్తున్నాయి. టోర్నీ మొదలై ఐదు రోజులు గడుస్తున్నా.. భారత్ ఇప్పటి వరకూ ఎంట్రీ ఇవ్వలేదు. మరో రెండు రోజుల్లో అంటే బుధవారం.. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకి అది టోర్నీలో మూడో మ్యాచ్ కానుంది. దీనిబట్టే అర్థం చేసుకోవచ్చు.. టీమిండియా ఎంత ఆలస్యంగా కప్ వేట ప్రారంభించనుందోనని..!
వాస్తవానికి ప్రపంచకప్‌లో భారత్ జట్టు లేట్ ఎంట్రీకి కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఎలా అంటే.. ఐపీఎల్ 2019 సీజన్‌లో నెలన్నరపాటు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడిన భారత్ ఆటగాళ్లకి కొంచెం రెస్ట్ కావాలని స్వయంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని బీసీసీఐ అభ్యర్థించింది. దీంతో.. భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని సవరించిన ఐసీసీ.. టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా రూపొందించింది. మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 సీజన్ మే 12న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే.