ICC World Cup 2019:India captain Virat Kohli "is doing fine" despite being hit on his thumb in a training session ahead of the team's World Cup opener against South Africa on Wednesday.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rohitsharma
#kedarjadav
#jaspritbumrah
#yuzvendrachahal
#cricket
#teamindia
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి అయిన గాయంపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని టీమిండియా ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్ తెలిపాడు. దీంతో భారత అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రపంచకప్ తొలి మ్యాచ్ కోసం శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా కోహ్లీకి కుడి చేతి బొటన వేలుకు గాయమైంది.
ప్రాక్టీస్ చేస్తుండగా బంతి గట్టిగా తాకడంతో కోహ్లీ విలవిలలాడాడు. వెంటనే టీమిండియా ఫిజియో పాట్రిక్.. కోహ్లీ బొటన వేలిపై స్ప్రే చల్లి ప్రథమ చికిత్స చేశాడు. అనంతరం కోహ్లీ కుదురుకున్నాడు. అయితే ప్రాక్టీస్ సెషన్ ముగింపు సమయంలో కోహ్లీ ఐస్ గ్లాస్‌లో వేలు పెట్టుకుని డగౌట్ చేరుకున్నాడు. దీంతో భారత అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
ఇక ఫిజియో ప్యాట్రిక్ ఫర్హత్.. కోహ్లీ గాయాన్ని పరిశీలించాడు. కోహ్లీ గాయంపై ఎలాంటి ఆందోళన అక్కర్లేదు. అతను త్వరగానే కోలుకుంటాడు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు కచ్చితంగా అందుబాటులో ఉంటాడని పేర్కొన్నాడు. మరోవైపు జట్టు వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించాయి. దీంతో భారత జట్టు ఊపిరి పీల్చుకుంది. ఇక గాయపడిన ఆల్‌రౌండర్‌లు విజయ్ శంకర్, కేదార్ జాదవ్ ఇప్పటికే కోలుకున్నారు.