ICC Criket World Cup 2019 : SA VS BAN : Tamim Iqbal defends wild throw from Lungi Ngidi

2019-06-03 286

During the fifth match of the ongoing ICC Cricket World Cup 2019 between South Africa and Bangladesh at The Oval, South Africa fast bowler Lungi Ngidi hurled a wild throw to Bangladesh opening batsman Tamim Iqbal.
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#lungingidi
#tamimiqbal
#southafrica
#bangladesh
#cricket

తన ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడన్న చిరాకుతో బ్యాట్స్‌మెన్ క్రీజులో ఉన్నప్పటికీ నేరుగా వికెట్ల మీదకు త్రో విసిరాడు సఫారీ పేసర్ లుంగి ఎంగిడి. వరల్డ్‌కప్ మెగా టోర్నీలో భాగంగా ఆదివారం బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కొత్త బంతిని అందుకున్న లుంగి ఎండిగి ఆశించిన మేరకు సత్తా చాటలేకపోయాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సఫారీలు బంగ్లాదేశ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించారు. దీంతో లుంగి ఎంగిడి వేసిన తొలి ఓవర్‌లో 5 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత రెండో ఓవర్‌లో రెండు పరుగులు ఇచ్చాడు. ఇక, మూడో ఓవర్‌లో సౌమ్య సర్కార్ మూడు ఫోర్లు బాదడంతో 14 పరుగులు సమర్పించుకున్నాడు.ఇక, ఎంగిడి వేసిన నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదిన సౌమ్య సర్కార్ ఆ తర్వాత బంతికి సింగిల్ తీసి తమీమ్ ఇక్బాల్‌కు స్ట్రైకింగ్ ఇచ్చాడు. దీంతో స్ట్రైకింగ్ ఎండ్‌లో తమీమ్ ఇక్బాల్ ఉండగా... నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో సౌమ్య సర్కార్ ఉన్నాడు. ఎంగిడి వేసిన నాలుగో బంతిని తమీమ్ ఇక్బాల్ డిఫెన్స్ ఆడాడు.