ICC World Cup 2019:Virat Kohli And Co. Sweat At Gym Ahead Of India's World Cup Opening

2019-06-03 80

ICC World Cup 2019:The ICC World Cup 2019 fever has taken over the cricketing fraternity. While every side has played one match each, so far, Virat Kohli-led Indian cricket team will be the last to open their campaign when they lock horns with South Africa on June 5 (Wednesday) at Southampton. Ahead of their World Cup opening fixture, Kohli and other Team India members were seen sweating out at the gym.
#iccworldcup2019
#viratkohli
#msdhoni
#rohisharma
#shikhardhavan
#jaspritbumrah
#yuzvendrachahal
#cricket
#teamindia

ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 5న సౌతాఫ్రికాతో తలపడనుంది. ప్రపంచకప్‌లోని మొత్తం పది జట్లలో ఇప్పటికే దాదాపు అన్ని జట్లు తమ తొలి మ్యాచ్‌ను ఆడాయి. ఆదివారం సౌతాఫ్రికా రెండో మ్యాచ్ ఆడగా.. ఈ రోజు ఇంగ్లాండ్ రెండవ మ్యాచ్ ఆడనుంది. అయితే టీమిండియా మాత్రం ఇంకా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అయితే ఈ సమయాన్ని టీమిండియా ప్లేయర్లు బాగానే ఉపయోగించుకుంటున్నారు.
తొలి మ్యాచ్‌ కోసం టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొంటున్నారు. ఇక వీలు చిక్కినప్పుడల్లా వివిధ ప్రాంతాలలో విహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం టీమిండియా ప్లేయర్లు జిమ్‌లో కసరత్తులు చేశారు. జిమ్‌ సెషన్ అనంతరం ఫొటోకు పోజులిచ్చారు. ఫొటోలో కెప్టెన్ కోహ్లీ, జాదవ్, శంకర్, భువీ, పాండ్యా, రాహుల్, బుమ్రాలు ఉన్నారు. ఈ ఫొటోను బీసీసీఐ తన అధికారిక ట్విటర్‌ అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అయింది.