Allari Naresh Shares His Father Last Days

2019-06-03 1

Allari Naresh Shares His Father Last Days. Allu Naresh participated in the shooting under compulsory circumstances.
#allarinaresh
#maharshi
#maheshbabu
#evvsatyanarayana
#aryanrajesh
#tollywood

ఈవివి దర్శకత్వంలో వచ్చిన 'జంబలకిడి పంబ' తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే ఒక క్లాసిక్ హిట్. అలాంటి సినిమాలను రీమేక్ చేయడం సాధ్యం కాదని, వాటిని మళ్లీ టచ్ చేయకూడదని అంటున్నారు ఈవివి తనయుడు అల్లరి నరేష్. అయితే నాన్నగారు తీసిన 'ఆ ఒక్కటీ అడక్కు', 'అలీ బాబీ అరడజను దొంగలు' సీక్వెల్ చేద్దామనే ఆలోచన ఉందని తెలిపారు. ఇండస్ట్రీకి వచ్చి 17 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇటీవల అల్లరి నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందర్భంగా తన తండ్రి సినిమాలకు సీక్వెల్ తీయడంపై స్పందించారు. కొన్ని సినిమాలకు సీక్వెల్ చేయాలనే ఆలోచన ఉంది. అయితే నాన్నగారి స్థాయిలో కామెడీ పండించగల దర్శకుడు దొరకడం అంత ఈజీ కాదు, దర్శకుడితో పాటు అందుకు సరిపడే కథ దొరికితే తప్పకుండా చేస్తామని నరేష్ తెలిపారు.