ICC World Cup 2019: Bangladesh beat South Africa by 21 runs at the Kennington Oval in London on Sunday. With this, Bangladesh have shaken up a few pre-tournament notions about how this World Cup is going to pan out. Asian teams have struggled at this World Cup so far, but Bangladesh put up their highest ODI total against South Africa.
#iccworldcup2019
#savban
#fafduplessis
#quintondekock
#mushfiqurrahim
#shakibalhasan
#cricket
ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో ఓటమి చవిచూడగా.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగిన బంగ్లాదేశ్ సమిష్టిగా రాణించి ఘనమైన బోణీ కొట్టింది. ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. సఫారీలు తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాభావం మరిచిపోకముందే.. బంగ్లా చేతిలో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. తొలి మ్యాచ్‌లోనే అద్భుత ఆటతో ఆగ్రశ్రేణి జట్లకు బంగ్లా హెచ్చరికలు జారీ చేసింది.
భారీ లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికాకు ఓపెనర్లు క్వింటన్ డికాక్ , మార్‌క్రమ్ మంచి శుభారంభం ఇచ్చారు. అయితే సమన్వయ లోపంతో డికాక్ రనౌట్‌గా అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ తన మార్క్ ఆటతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. ఈ క్రమంలో అర్ధ శతకం సాధించాడు. స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరూ పెవిలియన్ చేరారు.