తొలిసారి మీడియా ముందుకు అలీ, పులిబిడ్డపై ప్రశంసలు... మరి పవన్ గురించి?? ?

2019-05-30 571

Tollywood actor Ali has congratulated party chief YS Jagan Mohan Reddy ahead of the swearing-in ceremony event in Vijayawada.
#ysjaganmohanreddy
#comedianali
#pawankalyan
#janasena
#nagababu
#chandrababunaidu
#andhrapradesh
#tollywood

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్, అలీ మధ్య జరిగిన వివాదం గురించి అందరికీ తెలిసిందే. ఓ ఎన్నికల సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ అలీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీ కూడా ఏ మాత్రం తగ్గకుండా కౌంటర్ ఇచ్చారు. మంచి స్నేహితులుగా ఉన్న వీరు రాజకీయాల కారణంగా విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేక పోయారు.
మే 23న జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోవడం, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ సైతం పోటీ చేసిన రెండు చోట్ల పరాజయం పాలైన నేపథ్యంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ మద్దతుదారుడైన అలీ ఏం మాట్లాడతారో? ఎలాంటి కామెంట్ చేస్తారో? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.
ఎన్నికల ఫలితాల తర్వాత మీడియాకు ఎదురు పడకుండా జాగ్రత్త పడ్డ అలీ... ఎట్టకేలకు ఏపీ సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం నేపథ్యంలో విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. జగన్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టబోతుండటంపై ఆనందం వ్యక్తం చేశారు.

Videos similaires