ICC Cricket World Cup 2019: Give Him Any Role, Hardik Takes It up With A Smile: KL Rahul

2019-05-30 92

KL Rahul has heaped praise on his close friend and India teammate Hardik Pandya, saying the all-rounder revels in taking extra responsibility for the team."Being a fast bowling all-rounder he plays an important role in the set-up of the team, no matter what format. He does have the skill and everybody knows he has the skill. But how he has used that skill and grown in the last two years," said Rahul after his stellar knock against Bangladesh in India's final warm-up game before the World Cup.
#icccricketworldcup2019
#hardikpandya
#klrahul
#teamindia
#cricket
#england
#southafrica

టీమిండియా అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాపై కేఎల్‌ రాహుల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. జట్టులో ఎలాంటి అదనపు బాధ్యత అప్పగించినా పాండ్యా చిరునవ్వుతో స్వీకరిస్తాడని కేఎల్ రాహుల్ తెలిపాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో నాలుగో స్థానంలో దిగిన కేఎల్ రాహుల్ సెంచరీ బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "ఫాస్ట్‌ బౌలర్‌ ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌ పాండ్య జట్టు కూర్పులో కీలక పాత్ర పోషిస్తాడు. ఫార్మాట్‌తో పాండ్యాకు సంబంధం లేదు. పాండ్యాకు ఎటువంటి నైపుణ్యాలు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఆ ప్రతిభను ఉపయోగించి ఈ రెండేళ్లలో అతడు ఎంతగానో ఎదిగాడు" అని కేఎల్ రాహుల్ అన్నాడు.కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహారించిన కాఫీ విత్ కరణ్ టాక్ షోలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే, నిషేధం ముగిసిన తర్వాత వీరిద్దరి పునరాగమనం అద్భుతంగా ఉంది. వీరిద్దరూ ఐపీఎల్‌లో అద్భుత ప్రదర్శన చేసి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.