ICC World Cup 2019:MS Dhoni Impresses Virat Kohli With His Century In Warm-Up Match

2019-05-29 16

KL Rahul's stylish hundred at No 4 and a throwback to Mahendra Singh Dhoni's days of yore were the big gains for India in their emphatic 95-run win over Bangladesh in the second World Cup warm-up game at Sophia Gardens on Tuesday
#iccworldcup2019
#icccricketworldcup2019
#cwc2019
#worldcup2019
#bangladesh
#mashrafe
#mortaza
#viratkohli
#dhoni
#klrahul

మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సెంచరీ చేస్తే కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆనందం వ్యక్తం చేసాడు. ప్రపంచకప్‌ సన్నాహక మ్యాచ్‌లలో భాగంగా మంగళవారం బంగ్లాదేశ్‌తో భారత్‌ రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ఆడింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ 95 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలమైన టీమిండియా.. రెండో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పుంజుకుని అసలు సమరానికి ముందు అదరగొట్టింది.

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసిన విషయం తెలిసిందే. ఓపెనర్లు రోహిత్‌ (19), ధావన్‌ (1) విఫలమవగా.. కోహ్లీ భారీ స్కోర్ చేయలేదు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోనీ బౌండరీలు, సిక్సులతో హోరెత్తించాడు. ఓ సిక్స్ బాదితే ఏకంగా మైదానం అవతల పడింది. కేఎల్ రాహుల్‌తో కలిసి భారత ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు.సెంచరీ అనంతరం రాహుల్ అవుట్ అయినా.. ధోనీ మరింత విధ్వంసం సృష్టించాడు. ఈ క్రమంలోనే ధోనీ (113; 78 బంతుల్లో 8×4, 7×6) 94 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద జయేద్‌ బౌలింగ్‌లో సిక్స్‌ బాది శతకం పూర్తి చేశాడు. సెంచరీ అనంతరం డగౌట్ లో ఉన్న భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆనందంతో మురిసిపోయాడు. 'కమాన్ ధోనీ' అంటూ ప్రోత్సహించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అయింది.