ICC World Cup 2019:Angelo Mathews Says "I'm Surprised By Jayawardene's Comments"

2019-05-28 189

ICC World Cup 2019:Sri Lankan great Mahela Jayawardene on May 26 shocked the world when he revealed that he had declined the offer by his country's cricket board (Sri Lanka Cricket) to play a role in the national team's World Cup 2019 campaign.
#iccworldcup2019
#mahelajayawardene
#angelomathews
#dimuthkarunaratne
#srilankacricket
#cricket

శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి, అయితే వాటిని పట్టించుకోను అని ఆ జట్టు మాజీ కెప్టెన్‌ ఏంజిలో మాథ్యుస్‌ అన్నారు. జయవర్ధనే సారథ్యంలో 2011 ప్రపంచకప్‌లో లంక జట్టు ఫైనల్ వెళ్ళింది. ఇక 2015లో జయవర్ధనే రిటైరయ్యాక శ్రీలంక పరిస్థితి దారుణంగా మారింది. కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ఇవ్వడం, కొందరు ఆటగాళ్లు సస్పెండ్ కావడం వంటి వాటితో లంక జట్టు పూర్వ వైభవాన్ని కోల్పోయింది.
జయవర్ధనే అనంతరం చండిమాల్‌, తిసెరా పెరీరా, లసిత్‌ మలింగ, చమర కపుగెదరాలు జట్టు పగ్గాలు చేపట్టినా.. ఫలితం మాత్రం మారలేదు. ఇక ప్రపంచకప్‌ బాధ్యతలు దిముత్‌ కరునరత్నేకు అప్పగించారు. అయితే జయవర్ధనే ఆదివారం ఓ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలంక మాజీ కెప్టెన్లు ఏంజిలో మాథ్యుస్‌, దినేశ్‌ చండిమాల్‌లు క్రికెట్‌ రాజకీయాలకు బాధితులయ్యారని తీవ్ర స్థాయిలో విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై ఏంజిలో మాథ్యుస్‌ ట్విటర్‌ వేదికగా స్పందించారు. 'ఎవరికైనా సొంత అభిప్రాయాలు ఉంటాయి. జయవర్ధనే వ్యాఖ్యలు నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయి. అయితే నేను వాటిని పట్టించుకోను. ప్రపంచకప్‌లో లంక ప్రదర్శనే నాకు ముఖ్యం. జయవర్ధనే విలువైన సూచనలు ఇచ్చి జట్టు విజయానికి కృషి చేయాలి' అని మాథ్యుస్‌ కోరారు.