CC World Cup 2019: Bhuvneshwar Kumar Has A Message For Indian Fans Ahead Of World Cup!!

2019-05-28 113

ICC World Cup 2019:“We’ll try our best to play very well at the World Cup. I would like to ask the fans to keep supporting us throughout the tournament,” said Bhuvneshwar Kumar.
#iccworldcup2019
#bhuvneshwarkumar
#chahaltv
#rohitsharma
#dineshkarthik
#cricket
#teamindia

టీమిండియా స్టార్ స్పిన్నర్‌ యుజువేంద్ర చాహల్‌ నిర్వహించే చాహల్‌ టీవీలో భారత క్రికెట్ అభిమానులకు పేసర్ భువనేశ్వర్‌ కుమార్‌ ఓ విజ్ఞప్తి చేసాడు. ప్రపంచకప్‌ టోర్నీ ఆసాంతం తమకు మద్దతుగా నిలవాలని టీమిండియా అభిమానులను భువీ కోరాడు. ఈ మధ్య కాలంలో టీమిండియా ఎక్కడ మ్యాచ్ ఆడినా.. మనం చాహల్‌ టీవీని చూస్తున్నాం. ఇందులో చాహల్‌ అందరిని ఇంటర్వ్యూ చేస్తుంటాడు.
టీమిండియా ప్రపంచకప్‌ రెండో వార్మప్‌ మ్యాచ్‌ కోసం లండన్‌ నుంచి కార్డిఫ్‌ వెళ్తుండగా.. చాహల్‌ తన టీవీ షోని కొనసాగించాడు. ఈ సందర్భంగా పలువురు టీమిండియా క్రికెటర్లు చాహల్‌ షోలో పాల్గొని తమ మనసులోని మాటలను పంచుకున్నారు. భువనేశ్వర్‌ మాట్లాడుతూ.. 'ప్రపంచకప్‌లో అందరం మంచి ప్రదర్శన చేస్తాం. టోర్నీ ఆసాంతం తమకు మద్దతుగా నిలవాలి' అని భువీ అభిమానులను కోరాడు.