IPL 2019, Final: Kieron Pollard Throws Bat After Under Discussion Call From Umpire!!

2019-05-12 7

The Indian Premier League 2019 final witnessed quite a bit of drama in the last over of Mumbai Indians’ innings. The incident took place after Dwayne Bravo bowled a widish ball to Kieron Pollard who expected it to be called an illegitimate delivery. This was the second straight delivery that Pollard expected to be called a wide, but the call never came from umpire Nitin Menon.
#ipl2019winner
#mumbaiindians
#cskvmi
#rohitsharma
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson

ఉప్పల్‌ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 1 పరుగు తేడాతో విజయం సాధించింది. ముంబై నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య చేధనలో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 148 పరుగులకే పరిమితమైంది. ముంబై ఇండియన్స్‌కు సరైన ఆరంభం లభించలేదు. జట్టు స్కోరు 45 పరుగుల వద్ద శార్థూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఓపెనర్ క్వింటన్ డికాక్(29) కీపర్ ధోనీకి క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ(15) కూడా చాహర్ బౌలింగ్‌లో ధోనికి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్ నిలకడగా ఆడుతూ జట్టును ఆదుకొనే ప్రయత్నం చేశారు. అయితే, ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్‌లో జట్టు స్కోరు 82 పరుగుల వద్ద సూర్యకుమార్(15) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాతి ఓవర్‌లో కృనాల్ పాండ్యా(7) పరుగుల వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో నేరుగా అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.