IPL 2019,Final: Chennai Super Kings Captain MS Dhoni's Intelligence Gives Axar Patel Wicket!!

2019-05-12 32

IPL 2019: Most successful teams of the IPL—Mumbai Indians and Chennai Super Kings—final in Hyderabad on Sunday, following a rather eventful season that produced some unprecedented moments on the field.
#ipl2019
#cskvmi
#msdhoni
#iplfinal
#chennaisuperkings
#mumbaiindians
#shanewatson
#rohitsharma

చెన్నై సూపర్ కింగ్స్‌తో ఉప్పల్ వేదికగా ఈరోజు జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ముంబయి ఇండియన్స్ జట్టు వరుసగా ఓపెనర్ల వికెట్లు చేజార్చుకుంది. ఆరంభం నుంచి వరుస సిక్సర్లు బాదిన ఓపెనర్ డికాక్ (29: 17 బంతుల్లో 4x6) జట్టు స్కోరు 45 వద్ద ఔటయ్యాడు. ఇన్నింగ్స్ 5వ ఓవర్ వేసిన ఠాకూర్ బౌలింగ్‌లో సిక్స్ కొట్టబోయిన డికాక్.. వికెట్ కీపర్ ధోనీ చేతికి చిక్కాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే రోహిత్ శర్మ (15: 13 బంతుల్లో 1x4, 1x6) కూడా ధోనీకే క్యాచ్ ఇచ్చి ఔటవడంతో 5.2 ఓవర్లు ముగిసే సమయానికి ముంబయి 45/2తో నిలిచింది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ.. వికెట్ల వెనుక ఎంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తుంటాడో..? అందరికీ సుపరిచితమే. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ కదలికలకి అనుగుణంగా బౌలర్ల మార్పు, ఫీల్డింగ్ కూర్పులు చేసే ధోనీ తాజాగా మరోసారి తన మార్క్ కెప్టెన్సీతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖపట్నం వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో.. చిటికెడు మట్టి తీసుకుని గాల్లోకి వదిలిన ధోనీ.. ఫీల్డర్ ఇమ్రాన్ తాహిర్‌ను ‘నీకు క్యాచ్ రాబోతుంది’ అంటూ హెచ్చరిక సంకేతాలు ఇచ్చాడు. ఆ తర్వాత బంతికే బ్రావో బౌలింగ్‌లో అక్షర్‌ పటేల్ డీప్ ఫైన్‌లెగ్‌లో ఉన్న తాహిర్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
సాధారణంగా డ్వేన్ బ్రావో స్లో బంతులు విసురుతుంటాడు. దీంతో.. అక్షర్ పటేల్ అప్పర్ కట్‌ తప్పకుండా ప్రయత్నిస్తాడని ఊహించిన ధోనీ.. గాలి గమనంపై అవగాహన కోసం చిటికెడు మట్టి తీసుకుని గాల్లో వదిలాడు. అనంతరం తాహిర్‌ని ముందే హెచ్చరించి క్యాచ్‌కి సిద్ధంగా ఉంచాడు.