Junior NTR's uncle, YCP leader Narne Srinivasa Rao spoke to media at Lotus pond in Hyderabad. Chandrababu has become a habit to make alliance and deceive the parties. Narne said Amravati is still in the process of construction.
#APElection2019
#NarneSrinivasaRao
#ChandrababuNaidu
#YSjagan
#ycp
#tdp
#Amravati
#Narendramodi
ఎన్నికల ప్రచారానికి ఇంకా కొన్ని గంటల వ్యవదే ఉంది. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇక చంద్రబాబుకు రివర్స్ కౌంటర్ లు ఇస్తున్నారు వైసీపీ అధినేత జగన్ మరియు వైసీపీ నాయకులు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పొలిటికల్ హీట్ పీక్స్ చేరుతున్న సమయంలో చంద్రబాబు టార్గెట్ గా అయన విమర్శల వర్షం కురిపించారు. జూనియర్ ఎన్టీఆర్ మామ, వైసీపీ నేత నార్నే శ్రీనివాసరావు హైదరాబాద్ లోని లోటస్‌పాండ్‌లో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు పార్టీలతో పొత్తు పెట్టుకోవటం వారిని మోసం చేసి రివర్స్ తిట్టటం అలవాటుగా మారిందని ఆయన ఆన్నారు . ప్రతి ఐదేళ్లకొకసారి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం దానిని మోసం చేయడం, బయటకు రావడం, ఆ పార్టీని తిట్టించడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందన్నారు. గత ఎన్నికల్లో అదేతరహాలో బీజేపీతో పొత్తు పెటుకుని నాలుగేళ్ళు స్నేహం చేసి చివరకు ఎపీకి మోసం చేశారని ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని నార్నే ఫైర్ అయ్యారు.