AP Assembly Elections 2019: మనవడా... ''మందలగిరి'' కాదు, మంగళగిరి లోకేష్ పై లక్ష్మీ పార్వతి సెటైర్స్!

2019-04-04 829

YCP leader Lakshmi parvathi made sensational comments on minister , mangalagiri TDP candidate Nara Lokesh . It is clear that my grand son Nara Lokesh can't spell his constituency . He is speaking Mangalagiri as Mandalagiri . She has campaigned for YCP in Mangalagiri constituency Yerrabaalem village ,and she fired on Chandrababu and Lokesh
#apassemblyelections2019
#lokesh
#mangalagiri
#ycp
#lakshmiparvathi
#ramakrishnareddy
#chandrbabu
#ntr
#jagan

ఏపీ మంత్రి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ పై వైసీపీ నేత లక్ష్మీపార్వతి తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నారా లోకేష్ కు తానూ పోటీ చేసిన నియోజకవర్గం పేరు కూడా పలకటం రాదని ఎద్దేవా చేశారు . మంగళగిరి మండలం యర్రబాలెంలో వైసీపీ మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి తరపున లక్ష్మీపార్వతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.మంగళగిరిని మందలగిరి అని లోకేష్ అనడంపై ఆమె స్పందించారు. తాను మంగళగిరి అని స్పష్టంగా పలుకుతున్నా కానీ తన మనవడు నారా లోకేష్‌కి మంగళగిరి పలకడం ఇప్పటికీ రావడం లేదని ఎద్దేవా చేశారు. ఇక చంద్రబాబు గురించి చెప్పాలంటే అత్తే చెప్పాలని , స్వయంగా పిల్లనిచ్చి పెళ్లి చేస్తే మామను వెన్నుపోటు పొడిచి పదవి నుండి దించేసిన వ్యక్తి చంద్రబాబే అని అన్నారు. నీచ రాజకీయాలు చెయ్యటంలో చంద్రబాబు దిట్టని లక్ష్మీ పార్వతి ఫైర్ అయ్యారు.

Videos similaires