Yuvraj Singh was seen discussing retirement in the post-match conference with the reporters. Singh was last seen in India colors in 2017 against Windies and since then has not been part of the Indian team thanks to him going out of form and owing to poor fitness.
#ipl2019
#rishabhpant
#yuvrajsingh
#sachintendulker
#delhicapitals
#mumbaiindians
#msdhoni
#viratkohli
#teamindia
#iccworldcup2019
ఆటను ఆస్వాదిస్తున్నంత కాలం తాను రిటైర్మెంట్ గురించి ఆలోచించనని వెటరన్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్ వ్యాఖ్యానించాడు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రం తప్పుకుంటానని అతను స్పష్టం చేశాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో కూడా విఫలమవుతూ వస్తున్న యువీ ముంబై ఇండియన్స్ తరఫున తాజా సీజన్‌ను మాత్రం ఆత్మవిశ్వాసంతో ప్రారంభించాడు. ఆదివారం ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో అతను 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ‘రిటైర్ అయ్యేందుకు తగిన సమయం వచ్చేసిందని భావించిన రోజున ఎవరూ చెప్పకుండానే అందరికంటే ముందుగా నేను ఆ పని చేస్తా. గత రెండేళ్లుగా నా కెరీర్‌లో ఎత్తుపల్లాలు ఎదురయ్యాయి.