During the fourth match of the ongoing 12th season of the Indian Premier League between Rajasthan Royals and Kings XI Punjab at Jaipur, Kings XI Punjab opening batsman Chris Gayle registered his 25th IPL half-century.
#IPL2019
#RajasthanRoyals
#KingsXIPunjab
#RavichandranAshwin
#ajinkyarahane
#chrisgyale
#raina
#dhoni
#virat
#cricket
ఐపీఎల్‌లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ ఆటగాడు క్రిస్ గేల్ హాఫ్ సెంచరీ సాధించాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అర్థ శతకం నమోదు చేశాడు. మ్యాచ్ ఆరంభంలో నెమ్మదిగా ఆడిన గేల్.. కుదురుకున్న తర్వాత బ్యాట్ ఝుళిపించాడు. ప్రధానంగా ఉనాద్కత్ వేసిన 12 ఓవర్‌లో మూడు ఫోర్లు, 1 సిక‍్సర్ కొట్టాడు. ఆ ఓవర్‌లో 19 పరుగుల్ని గేల్ సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కింగ్స్ ఆదిలోనే కేఎల్ రాహుల్(4) వికెట్‌ను కోల్పోయింది. ఆ తరుణంలో మయాంక్ అగర్వాల్-గేల్ జోడి సమయోచితంగా బ్యాటింగ్ చేసింది. వీరిద్దరూ 56 పరుగులు జోడించిన తర్వాత మయాంక్(22) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. ఆపై సర్పరాజ్ ఖాన్‌తో ఇన్నింగ్స్‌ను గేల్ ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు.స్క్రోర్ పెంచే క్రమం లో ధాటిగా ఆడిన క్రిస్ గేల్ 47 బంతుల్లో 79 పరుగులు చేసాడు.క్రిస్ గేల్ ఇన్నింగ్స్ లో 4 భారీ సిక్స్ లు 8 పోర్లు ఉన్నాయి.
స్కోర్ బోర్డ్ ని పరుగులు పెట్టించిన క్రిస్ గేల్ స్టొక్స్ బౌలింగ్ లో,త్రిపాటి కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.