Mumbai Indians (MI) all-rounder Kieron Pollard plucked on a one-handed stunner to dismiss Delhi Capitals (DC) skipper Shreyas Iyer during match four of 2019 edition of the Indian Premier League (IPL) at the Wankhede Stadium in Mumbai
#ipl2019
#delhicapitals
#mumbaiindians
#kieronpollard
#shreyasiyer
#ipl
#catch
#shikardhavan
#Prithvi Shaw
ఐపీఎల్ 2019 సీజన్‌లో భాగంగా ముంబైలోని వాంఖడె స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకుని అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. వివరాల్లోకి వెళితే... ఆదివారం రాత్రి 8 గంటలకు ముంబై-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీకి ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ పృథ్వీ షా(7) పరుగులకే ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మరో ఓపెనర్‌తో శిఖర్ ధావన్‌తో కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో మెక్లీన్‌గాన్ బౌలింగ్‌లో శ్రేయాస్ అయ్యర్ బాదిన బంతిని ఒంటిచేత్తో ఒడిసిపట్టుకున్నాడు.దీంతో నిరాశగా శ్రేయాస్ అయ్యర్ పెవిలియన్‌కు చేరాడు. పొలార్డ్ ఒంటిచేత్తో పట్టిన క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.