IPL 2019: Dhoni Shares His Emotional Moments with Chennai Super Kings In Roar Of The Lion Documentry

2019-03-22 447

Dhoni on the show recalls CSK's two-year suspension from the IPL and also the "emotional" return in 2018. Dhoni opened up on the comments of match fixing that were levied against him. Firstly Dhoni feels his association with CSK is like an "arranged marriage".
#IPL2019
#MSDhoni
#chennaisuperkings
#RoyalChallengersBangalore
#viratkohli
#SunrisersHyderabad
#MumbaiIndians
#DavidWarner
#kolkataknightriders
#rajasthanroyals
#cricket


భారత్‌కు రెండు వరల్డ్‌కప్‌లను అందించిన ఏకైక కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఒకానొక సందర్భంలో కన్నీరు పెట్టుకున్నాడు. ఇంతకీ ధోని ఎప్పుడు కన్నీరు పెట్టుకున్నాడని అనుకుంటున్నారా? నిషేధం అనంతరం ఐపీఎల్ 2018 సీజన్‌లో చెన్నై జట్టు పునరాగమనం చేసిన సందర్భంలో తన నోటి నుంచి మాటలు రాలేదని, తన కళ్లలో నీరు వచ్చిందని ధోని స్వయంగా వెల్లడించాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై హాట్‌ స్టార్‌ ఐదు ఎపిసోడ్ల 'రోర్‌ ఆఫ్‌ ద లయన్‌' పేరిట ఓ డాక్యుమెంటరీని బుధవారం విడుదల చేసింది.
కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలపై ధోని మాట్లాడాడు. 'తిరుంబి వందుతేను సొల్లు' అనే టాగ్‌లైన్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ పునరాగమనం చేసిందని ధోనీ వెల్లడించాడు. 'తిరుంబి వందుతేను సొల్లు' అంటే 'తిరిగొచ్చామని వాళ్లకు చెప్పండి' అని అర్థం. 2013 తన కెరీర్‌లో చీకటి అధ్యాయమని ధోని తెలిపాడు.