IPL 2019: Chawla, the senior Kolkata Knight Riders spinner, said Kuldeep never stopped improving and that was key in his rise.
#IPL 2019
#KuldeepYadav
#PiyushChawla
#KolkataKnightRiders
#Yuzvendrachahal
#dineshkarhtik
#royalchallengersbengaluru
#chennaisuperkings
#cricket
చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ మంచి ప్రతిభ ఆధారంగానే ఈస్థాయికి చేరుకున్నాడని మరో స్పిన్నర్ పియూష్ చావ్లా అన్నాడు. ఐపీఎల్‌లో వీరిద్దరూ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఆడుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుల్దీప్‌తో కలిసి ఆడిన అనుభవాలను పియూష్ చావ్లా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.
చావ్లా మాట్లాడుతూ "కుల్దీప్ ఎప్పుడూ అనుమానాస్పద బౌలర్‌గా ముద్ర వేసుకోలేదు. అదొక అపోహ మాత్రమే. కుల్దీప్‌లో మంచి నైపుణ్యం దాగుందని, మరింత మెరుగ్గా రాణించేందుకు కష్టపడుతున్నాడు" అని అన్నాడు. ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో చైనామన్ స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ మంచి ప్రదర్శన చేస్తారని చెప్పాడు.
ఇటీవలి కాలంలో కుల్దీప్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడని, వరల్డ్ కప్‌లో కుల్దీప్‌కు మంచి బ్యాట్స్‌మెన్ ఎదురైతే అది సవాల్‌గా మారుతుందని చావ్లా చెప్పుకొచ్చాడు. మరోవైపు వరల్డ్‌కప్‌కు ముందు జరిగే ఐపీఎల్‌లో ఆటగాళ్లు తమ ఫిట్‌నెస్‌తో పాటు పని భారాన్ని సమీక్షించుకోవాలన్న కెప్టెన్ కోహ్లీ వ్యాఖ్యలపై కూడా చావ్లా స్పందించాడు.