"I see lots of similarities between myself and Virat. We are both fighters and don't enjoy losing, we love batting together and taking the game away from teams," De Villiers added.
#ICCWorldCup2019
#ABDeVilliers
#ViratKohli
#IPL2019
#southafricabatsman
#teamindiacaptain
#cricket
ఈ ఏడాది ఆరంభం అయ్యే ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్ లల్లో భారత కేప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత ప్రమాదకారి బ్యాట్స్ మన్ గా మారుతాడని, అతణ్ని అంత సులభంగా ఎవరూ పెవిలియన్ దారి పట్టించలేరని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అభిప్రాయపడ్డారు. ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతూ విరాట్ కోహ్లీని దగ్గరి నుంచి చూశానని, అతనిది ఓటమిని అంత త్వరగా అంగీకరించే మనస్తత్వం కాదని చెప్పారు. తనలాగే విరాట్ కూడా ఓ యోధుడని కితాబిచ్చాడు. ఈ సారి ప్రపంచకప్ లో విరాట్ కొరకరాని కొయ్య అవుతాడని చెప్పారు.