Lok Sabha Election 2019: ప్రచారంలో కాంగ్రెస్ న్యూ స్ట్రాటజీ.. జలమార్గం ద్వారా ప్రియాంక క్యాంపెయిన్ !

2019-03-16 136

Priyanka Gandhi is trying to impress people through the channel. From 18th to 20th this month. from Prayog Raj to Varanasi, we have to go to Ganga along with the riverbank people. 100 kilometer from Prayag rai to Varanasi is on the motor boat.
#LokSabhaElection2019
#PriyankaGandhi
#rahulgandhi
#PMmarendramodi
#Prayagraj
#Varanasi

ఓట్ల పండుగ రావడంతో వయోజనులను ఆకట్టుకునేందుకు నేతలు పాట్లు పడుతున్నారు. విభిన్న రకాలుగా ప్రచారం చేసి ఓట్లు దండుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రచారం ద్వారానే ప్రజల నోళ్లలో నానుతూ .. ఓటు బ్యాంకుగా మలచుకోవాలని భావిస్తున్నారు.
భారత రాజకీయాల్లో ఇదివరకు ఎన్నడూ లేని పంథాను ఎంచుకున్నారు కాంగ్రెస్ పార్టీ తురుపుముక్క, స్టార్ క్యాంపెయినర్ ప్రియాంక గాంధీ. జలమార్గం ద్వారా ప్రచారం చేసి జనాలను ఆకట్టుకోవాలని యోచిస్తున్నారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ప్రయోగ్ రాజ్ నుంచి వారణాసి వరకు గంగానదీపై ప్రయాణించి .. నదీ పరివాహక ప్రజలతో మమేకమవుతారని కాంగ్రెస్ పార్టీలు పేర్కొన్నాయి.