Shane Warne Says MS Dhoni as 'Must-Have' Player In World Cup 2019

2019-03-13 176

Australian legend Shane Warne said MS Dhoni is still adaptable and can bat anywhere India needed him to bat for the World Cup. Warne also said Virat Kohli needed Dhoni's experience on the field.
#indiavsaustralia
#australiainindia2019
#iccworldcup2019
#msdhoni
#teamindia
#shanewarne
#viratkohli
#india
#australia
#rishabpant
#kuldeep

మొహాలీ వన్డే అనంతరం టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని విమర్శించిన వాళ్ల నోళ్లు మూత పడ్డాయని ఆసీస్ స్పిన్ లెజెండ్ షేన్‌ వార్న్‌ పేర్కొన్నాడు. ధోనిని రిటైర్మెంట్‌ తీసుకొమ్మని ఉచిత సలహాలు ఇచ్చిన వారికి ఇప్పటికైనా ప్రపంచకప్‌లో ధోని అవసరం ఎంత ఉందో అందరూ అర్థం చేసుకోవాలన్నాడు. బ్యాటింగ్‌లో ఏ స్థానంలోనైనా ఆడగల సత్తా ధోనికి ఉందన్నాడు.ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న 2019 వరల్డ్‌కప్‌లో భారత్‌కు అతడి సేవలు అవసరమని వార్న్ అభిప్రాయపడ్డాడు. "ధోని గొప్ప ఆటగాడు. జట్టు అవసరాల రీత్యా అతడు ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేయగలడు. ఎలాంటి స్థితికైనా అతడు తనను తాను బాగా అన్వయించుకుంటాడు. ధోనీని విమర్శించే వాళ్లకు.. వాళ్లేమి మాట్లాడుతున్నారో వాళ్లకే తెలియదు" అని అన్నాడు.