Ram Gopal Varma RGV's Lakshmi's NTR, which is biopic of NT Rama Rao, has received good response in its pre-release business with its theatrical rights getting decent price. A leading distributor is said to have acquired its rights for a price of Rs 9 crore, which is a big amount considering RGV's recent career graph.
#lakshmisntr
#ramgopalvarma
#tollywood
#laxmiparvathi
#ntr
#balakrishna
#chandrababu
#krish
#kalyanram
#sumanth
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఆర్జీవీ ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టారు . సినిమాను హిట్ చేయడం, లాభాలు చూపించడమే లక్ష్యంగా స్కెచ్ వేస్తున్నారు. ఇటీవల విడుదలైన 'ఎన్టీఆర్ బయోపిక్' రెండు భాగాలు ఫెయిలైన నేపథ్యంలో.. పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నాడు.ఎన్టీ రామారావు జీవితంలోకి రెండో భార్యగా లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు ఈ చిత్రంలో ప్రధానంగా చూపించబోతున్నారు. ముఖ్యంగా ఈ పెళ్లి తర్వాత రామారావు కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఆయన జీవితంలో అత్యంత విషాదకరమైన వెన్నుపోటు పర్వం వెనక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? ఆ సమయంలో ఆయన అనుభవించిన మనోవేధన ఇందులో ప్రధానంగా చూపించబోతున్నారు.