ICC Cricket World Cup 2019 : Tendulkar Says He Would Hate To Give Two Points To Pak In World Cup

2019-02-23 157

Sachin Tendulkar said he would "hate" to see India concede two points to Pak by not playing them in the upcoming ICC World Cup 2019 as such a move would only help the arch-rivals in the mega-event.
#iccworldcup2019
#indiavspak
#sachintendulkar
#icc
#cricket
#sunilgavaskar
#bcci
#vinodroy
#manchester
#england

జూన్ 16న మాంచెస్టర్‌లోని ఓల్ట్ ట్రాఫోర్డ్ వేదికగా భారత్-పాక్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. బీసీసీఐ సైతం భారత ప్రభుత్వం పాక్‌తో మ్యాచ్ ఆడకూడదని ఆదేశిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడుతామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ స్పందించాడు.వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌పై ప్రతిసారీ భారత్‌దే పైచేయి. ఇది మరోసారి వారిని ఓడించే సమయం. రెండు పాయింట్లు అప్పగించి టోర్నీలో వారికి సాయం చేయడాన్ని నేను అసహ్యించుకుంటా. ఇంతకు ముందే చెప్పినట్టు నా దృష్టిలో భారత్‌కే ప్రథమ ప్రాధాన్యం. అందుకే నా దేశం తీసుకొనే నిర్ణయం ఏదైనా మనసారా ఆహ్వానిస్తా" అని సచిన్‌ అన్నాడు.