Notice To Mahesh Babu's Theatre Over Violating GST Norms

2019-02-20 165

Super Star Mahesh Babu's multiplex AMB (Asian Mahesh Babu) Cinemas has been fast becoming the favorite movie watching destination for movie lovers for the world class experience it is providing. In the midst of all this, the theatre management hogged the media limelight for the wrong reasons.
#ambcinemas
#maheshbabu
#namratashirodkar
#krishna
#tollywood
#GST
#Asian
#maharshi
#vamshipaidipalli
#pujahegde

హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో అత్యాధునిక హంగులతో నిర్మించిన ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్ గత ఏడాది డిసెంబర్ లో ప్రారంభం అయింది. మహేష్ బాబు ఎంఎబి సినిమాస్ లో కీలక భాగస్వామిగా ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ చేతుల మీదుగా ఈ మల్టిప్లెక్స్ లాంచ్ అయిన తర్వాత బాగా పాపులర్ అయింది. ప్రేక్షకుల సందడి కూడా బాగానే పెరిగింది. ఈ మల్టిప్లెక్స్ కి వెళ్లాలనుంటే చేతులో డబ్బు కూడా బాగానే ఉండాలి.

కొన్ని రోజుల క్రితం మహేష్ బాబుకు టాక్స్ విషయంలో జీఎస్టీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే జీఎస్టీ అధికారులు ఏఎంబి సినిమాస్ కు నోటీసులు జారీ చేశారు. నిబంధనల్ని అతిక్రమించిన నేపథ్యంలో ఏఎంబి సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం సినిమా టికెట్స్ విషయంలో 28 శాతంగా ఉన్న జిఎస్టీని 18 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త రేట్లు జనవరి 1 నుంచి అమలయ్యాయి. కానీ ఏఎంబి సినిమాస్ మాత్రం పాత నిబంధనలతోనే ప్రేక్షకులకు అధిక ధరకు టికెట్ విక్రయిస్తున్నట్లు తెలిసిందే. దీoతో విచారణకోసం జీఎస్టీ అధికారులు రంగంలోకి దిగారు. రంగారెడ్డి జిల్లా జీఎస్టీ కమిషనరేట్ యాంటీ ప్రాఫిటీరింగ్ అధికారులు ఏఎంబి సినిమాస్ కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఇందులో ఏషియన్ గ్రూప్ కూడా భాగస్వామిగా ఉంది.