Ram Gopal Varma Reveals Why He Did't Direct Balayya's NTR Biopic

2019-02-19 202

Ram Gopal Varma reveals why he did't direct Balayya's NTR biopic.Lakshmi's NTR is an upcoming Indian Telugu, biographical drama film based on the real life of former chief minister of undivided Andhra Pradesh N. T. Rama Rao from the perspective of his wife, Lakshmi Parvathi. It is directed by Ram Gopal Varma, Agasthya Manju and produced by Rakesh Reddy. Recently NTR mahanayakudu movie trailer released.
#Lakshmi'sNTR
#Lakshmi'sNTRtrailer
#RamGopalVarma
#NTRmahanayakudu
#NTRBiopic
#Balayya
#rgv
#tollywood

నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రెండవ భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మహానాయకుడు ట్రైలర్ ని ఇటీవల విడుదల చేశారు. అంతకు ముందే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదలై హాట్ టాపిక్ గా మారింది. ఓ టివి చర్చా కార్యక్రమంలో ఎన్టీఆర్ మహానాయకుడుపై ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రకటించగానే దర్శకుడిగా మొదటి వినిపించిన పేరు రాంగోపాల్ వర్మ. కానీ అనూహ్యంగా ఈ చిత్రం మరో దర్శకుడి చేతుల్లోకి వెళ్ళింది. వర్మ ఈ చిత్రం నుంచి ఎందుకు తప్పుకున్నాడో కారణాలు బయటకు రాలేదు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ గురించి ఓ ఛానల్ లో చర్చా కార్యక్రమం జరిగింది. ఈ డిబేట్ లో తాను ఎందుకు ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందో వర్మ వివరించాడు.
మహాత్మాగాంధీ బయోపిక్ తీయాలని భావిస్తే.. ఆయన్ని ట్రైన్ లోనుంచి తోసేసిన సంఘటన మొదలుకుని బ్రిటిష్ వారితో పోరాడి స్వాతంత్రం తీసుకొచ్చినసన్నివేశాల వరకు చూపించాలి. గాంధీ జీవితంలో సినిమాటిక్ డ్రామా మొత్తం ఆ పీరియడ్ లోనే ఉంది. బ్రిటిష్ వారు అనే విలన్ కూడా ఈ సినిమాలో వుంటారు. ఈ అంశాలన్ని వదిలేసి గాంధీ ఎలా పుట్టారు, ఎలా పెరిగారు లాంటి సన్నివేశాలని చూపిస్తే బయోపిక్ కు అర్థం లేదని వర్మ తెలిపారు.
అదే విధంగా ఎన్టీఆర్ జీవితంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కీలక దశ ప్రారంభమైంది. లక్ష్మి పార్వతి ఆయన జీవితంలోకి ప్రవేశించడం అనేది ఇంకా కీలకం. ఈ అంశాలని వదిలేసి సినిమాల్లో ఎలా రాణించాడు అనే కథ అంత ఆసక్తిగా ఉండదని వర్మ అభిప్రాయ పడ్డాడు. అందుకే తాను ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తప్పుకున్నట్లు వర్మ తెలిపారు.
వర్మ రూపొందించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కు విశేష స్పందన వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ ట్రైలర్ 7.5 మిలియన్ వ్యూస్ సాధించింది.