Indian cricket's one of the best player MS Dhoni's career has been like a fairy tale so far, which included 2 World Cups, Champions Trophy and many other prestigious titles. The man who always ended the game in style with a long six would like to announce his retirement with another World Cup trophy in hand.
#ICCWorldCup2019
#MSDhoni
#ChampionsTrophy2019
#virat kohli
#rohithsharma
#rishabpanth
#dineshkarthik
#cricket
#teamindia
మహేంద్ర సింగ్ ధోనీ.. భారత క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. వన్డే, టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని భారత్‌కు అందించిన ఏకైక కెప్టెన్. ఎన్నో మ్యాచ్‌ల్లో టీమిండియాను ఒంటిచేత్తో గెలిపించాడు. సిక్సర్లతో మ్యాచ్‌ను ముగించడంలో దిట్ట. అందుకే ధోనిని అభిమానులు ముద్దుగా ఫినిషర్ అని పిలుచుకుంటారు.
ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోని... ఈ ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలకాలనే ఆలోచనలో ఉన్నాడు. 2007లో టీ20 వరల్డ్ కప్ భారత్‌కు అందించి.. తన కెరీర్‌కు గట్టి పునాది వేసుకున్న ధోని.. ఇంగ్లాండ్‌లో వరల్డ్‌కప్‌ని అందించిన తన సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి వీడ్కోలు పలకాలని ధోని అభిమానులు ఆశిస్తున్నారు.
క్రికెట్‌లో లవ్, రివెంజ్ చాలా పవర్‌ఫుల్. ఈ రెండింటితో ఎవరైనా ఏదైనా చేయగలరు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా విరాట్ కోహ్లీ సేన అదేపని చేసి చూపించింది. ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియా జట్టుని చిత్తుగా ఓడించింది. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకొనేందుకు ఆరోన్ ఫించ్ సారథ్యంలోని కంగారుల జట్టు టీమిండియా పర్యటనకు రాబోతోంది. గతంలో అనేకసార్లు టీమిండియాను ఆస్ట్రేలియా ఓడించింది. అయితే, ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను ఓడించడం మాత్రం కంగారులకు ఓ పీడకలే.
ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరిస్‌లో ధోని వరుసగా మూడు హాఫ్ సెంచరీలు సాధించి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డుని సైతం అందుకున్నాడు. ముఖ్యంగా చివరి వన్డేలో 87 పరుగులతో ధోని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడి మునుపటి మహీని గుర్తుకు తెచ్చాడు. గత కొన్నాళ్లుగా నిరాశ పరుస్తున్నధోని తనలోని ఫినిషర్‌ను ఈ సిరిస్‌లో తట్టిలేపాడు. 2018లో ఆడిన 20 మ్యాచ్‌ల్లో 25 యావరేజితో కేవలం 275 పరుగులు మాత్రమే చేసిన ధోని వరల్డ్‌కప్‌కి ముందు ఫామ్‌లోకి రావడం అభిమానులకు ఆనందానికి గురి చేసింది.
ఈ ఏడాది ఆడిన 6 మ్యాచ్‌ల్లో ధోని ఇప్పటికే 242 పరుగులు చేశాడు. యావరేజి 121 కావడం విశేషం. దీంతో వరల్డ్‌కప్ జట్టులో ధోని కీలకంగా మారాడు. వరల్డ్ కప్ కోసం జట్టుని ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో ధోనీని సెలెక్టర్లు ఎంపిక చేస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్నందున జట్టులో ధోని చాలా కీలకం కానున్నాడు.