ఎన్నికల వేళ వైసిపి లో చేరేందుకు ఎక్కువగా ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే టిడిపి నుండి మేడా మల్లిఖార్జున రెడ్డి, ఆమంచి కృష్ణమోహన్, అవంతి శ్రీనివాస్ వైసిపి లో చేరారు. తాజాగా, మాజీ డిజిపి సాంబశివరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన వైసిపి లో చేరుతారని ఆ పార్టీలోని ముఖ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం. జగన్ పాదయాత్ర సమయంలోనే మాజీ డిజిపి సాంబశివరావు జగన్ ను కలిసారు. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి మర్యాద పూర్వకంగా కలిసారు. ఆ సమయంలో సాంబశివరావు వైసిపి లో చేరుతున్నారనే ప్రచారం జరిగింది. కానీ, డిజిపి గా రిటైర్ అయిన తరువాత ఏపి ప్రభుత్వం ఆయనకు గంగవరం పోర్టులో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ హోదాలో ఉన్న సమయంలోనే ఆయన జగన్ ను కలిసారు. ఆ వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు తన వద్దకు సాంబ శివరావును పిలిపించుకొని జగన్ ను కలవటం పై వివరణ అడిగారు. ఆ తరువాత తాను తమ పోర్టు పరిధిలోకి వచ్చిన ప్రతిపక్ష నేతను మర్యాద పూర్వకంగానే కలిసానని.. తనకు పార్టీలో చేరే ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న వేళ..ఆయన వైసిపి లో చేరుతున్నారని ఆ పార్టీ నేతలు చెప్పటం ఇప్పుడు చర్చనీ యాంశంగా మారింది. సాంబశివ రావు స్వస్థలం ప్రకాశం జిల్లా.
ఆళ్లగడ్డ లో సుదీర్ఘ కాలంగా టిడిపి లో ఉన్న ఇరిగినేని రాంపుల్లారెడ్డి సోదరులు జగన్ సమక్షంలో వైసిపి లో చేరుతు న్నారు. వారు మంత్రి అఖిలప్రియ అవినీతికి పాల్పడుతున్నారంటూ అప్పట్లో సంచలన ఆరోపణలు చేసారు. టీడీపీ ఇన్‌చార్జ్‌గా పనిచేసిన ఇరిగెల పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అయితే, మంత్రి అఖిలప్రియతో ఉన్న విభేదాల కారణం గా పార్టీకి దూరం జరిగారు. గతేడాది డిసెంబరు 28న టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పుడు వైసీపీ లో చేరనున్నారు. ఆళ్లగడ్డలో ఇప్పటికే మంత్రి అఖిల కు వ్యతిరేకంగా టిడిపి నేతలు ఒక్కటయ్యారు. వచ్చే ఎన్నికల్లో అఖిలకు సీటు ఇవ్వరనే ప్రచారం చేస్తున్నారు. భూమా నాగిరెడ్డి తో సన్నిహితంగా ఉండే ఏవి సుబ్బారెడ్డి సైతం ఇప్పుడు భూమా అఖిలతో రాజకీయంగా గ్యాప్ వచ్చింది. దీంతో..ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇస్తే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఎన్నికల వేళ..రాంపుల్లారెడ్డి సోదరులు వైసిపి లో చేరటం ఆ ప్రాంతంలో టిడిపికి నష్టమనే చర్చ జరుగుతోంది.
Ex DGP Nanduri Samba Siva Rao may join in YCP. As information form ycp shortly he join in party. After he retire as DGP he nominated in a key post in Gangavaram port. In padayatra time he met Jagan.
#YS jagan
#DGPNanduriSambaSivaRao
#YCP
#Jaganpadayatra
#Gangavaramport
#APElection2019