World Cup 2019: Ashish Nehra Lists 5 Reasons Why Rishabh Pant Should Be In India's World Cup Squad

2019-02-15 75

A pure match-winner, a back-up opener and an effortless six-hitter in the class of Rohit Sharma -- Rishabh Pant merits selection in India's World Cup squad and there are more than one reasons for it, feels former pacer, Ashish Nehra.
#RishabhPant
#AshishNehra
#RohitSharma
#WorldCup2019
#WorldCup2019Squad
#dineshkarthik
#bumrah
#ambatirayudu
#cricket
#teamindia

ఇంగ్లాండ్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఆడబోయే భారత జట్టులో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తప్పక ఉండాల్సిందేనంటూ మాజీ పేస్ బౌలర్ ఆశిష్ నెహ్రా పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరిస్ ముగిసే నాటికి ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వరల్డ్‌కప్‌లో ఆడే జట్టుపై పూర్తి స్పష్టత రానుందని ఇటీవలే ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు వరల్డ్‌కప్ తుది జట్టు ఎంపిక ప్రణాళికల్లో విజయ్ శంకర్, రిషబ్ పంత్, కేదార్ జాదవ్, ఖలీల్ అహ్మద్, రహానేలు ఉన్నారని చెప్పడంతో వారంతా ఈ సిరిస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
అయితే, వరల్డ్‌కప్ జట్టులో రిషబ్ పంత్ ఉంటాడా లేడా అన్నదానిపై స్పష్టత లేదు. దీంతో పంత్ మాత్రం జట్టులో ఉండాల్సిందేనని ఆశిష్ నెహ్రా అంటున్నాడు. ఇందుకు తన వద్ద ఐదు కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆశిష్ నెహ్రా మాట్లాడుతూ "జట్టు విజయంలో చాలా మంది పాత్ర పోషిస్తుండవచ్చు. వరల్డ్‌కప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఎక్స్ ఫ్యాక్టర్ ఉన్న ప్లేయర్స్ కావాలి. పంత్ కచ్చితంగా ఓ మ్యాచ్ విన్నర్. అతన్ని కచ్చితంగా వరల్డ్‌కప్‌కు ఎంపిక చేయాలి" అని నెహ్రా అన్నాడు.
"ప్రస్తుతం భారత జట్టులో ఓపెనర్ శిఖర్ ధావన్‌ తప్ప తొలి ఏడు మంది బ్యాట్స్‌మెన్‌లో మరో ఎడమచేతివాటం బ్యాట్స్‌మన్ లేడు. జట్టులో ఎడమ, కుడి కాంబినేషన్ కచ్చితంగా ఉండాలి. ఇక్కడ రిషబ్ పంత్ పనికొస్తాడు. దీంతో పాటు రెండోది రిషబ్ పంత్ ఒకటో నంబర్ నుంచి ఏడో స్థానం వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు" అని నెహ్రా చెప్పాడు.