Ind vs New Zealand: MS Dhoni gave another fine example of his cricketing brilliance as he plotted the dismissal of Trent Boult with Kuldeep Yadav at Napier.
#IndiavsNewZealand
#MSDhoni
#1stODISeries
#ViratKohli
#kuldeepyadav
#chahal
#rohithsharma
#Napier
మహేంద్ర సింగ్ ధోని... ప్రపంచ క్రికెట్‌కు పరిచయం అక్కర్లేని పేరు. వికెట్ కీపర్‌గా బ్యాట్స్‌మన్‌గా అనేక చిరస్మరణీయ విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా వికెట్ల వెనుక నుంచి ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ ఆలోచనల్ని వేగంగా చదవడంలో ధోనీది అందివేసిన చేయి.
తన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌లో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ని ఔట్ చేయడంలో భారత్ బౌలర్లకి ధోని సాయపడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా స్పిన్నర్లకు ధోని కీలక సూచనలు చేస్తుంటాడు. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా నేపియర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో ధోని తన వ్యూహంతో మరోసారి తిరుగులేదని నిరూపించుకున్నాడు.