India vs Australia 2nd ODI: Virat Kohli & Co Sweat It Out In Nets Ahead Of Acid Test At Adelaide

2019-01-15 123

he temperature in Adelaide is touching a searing 37 degrees Celsius and is expected to cross 40 on the day of the match.
#IndiaVsAustralia2ndODI
#MSDhoni
#Virat Kohli
#RohitSharma
#BhuvneshwarKumar

మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం అడిలైడ్ వేదికగా జరగనుంది. ఇందులో భాగంగా కోహ్లీసేన ఇప్పటికే అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలో అడిలైడ్ వచ్చిన భారత్ జట్టు సోమవారం ప్రాక్టీస్ చేసింది.
ప్రాక్టీస్ అనంతరం కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అభిమానులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారి కోసం కొంత సమయం కేటాయించి ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. తొలి వన్డేలో టీమిండియా 34 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే.
తొలి వన్డేలో టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో... రెండో వ‌న్డే గెలుపే ల‌క్ష్యంగా కోహ్లీ సేన సోమవారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్ చేసింది. టీమిండియా నెట్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకుంది.