Why Chandrababu Naidu Takes U Turn On Pawan Kalyan Issue

2019-01-03 702

Andha Pradesh Chief Minister Nara Chandrababu Naidu now wooing Jana Sena chief Pawan Kalyan for 2019 lok sabha and assembly elections. Now He targets only modi kcr and YS Jagan.
#2019loksabhaelections
#ChandrababuNaidu
#PawanKalyan
#ysjagan
#kcr

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులో మార్పు ఎందుకు వచ్చింది? హఠాత్తుగా ఆయన పవన్ తమతో కలవాలని ఎందుకు చెప్పారు? ఇది అందరిలోను తలెత్తుతున్న ప్రశ్న. దీనిపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఆయన మళ్లీ జనసేనానిని మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేశారని అంటున్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే ఓటమిని ముందే అంగీకరించినట్లుగా ఉందని, టీడీపీ ఓటమి తేలిపోయిందని వైసీపీ నేత మల్లాది విష్ణు ఇటీవల అన్నారు. చంద్రబాబు ఓటమి భయంతో పవన్‌తో పొత్తు కోసం వెంపర్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిన్నటి వరకు జనసేనానిని విమర్శించి, ఇప్పుడు పొత్తుకు పిలవడం ఏమిటన్నారు.

పవన్ కళ్యాణ్, టీడీపీ కలిసి పోటీ చేస్తే తప్పేమిటని, జగన్‌కు నొప్పి ఎందుకు అని చంద్రబాబు రెండు రోజుల క్రితం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అప్పటి నుంచి కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ ఏపీకి అన్యాయం చేశారని, తాము కాంగ్రెస్ పార్టీతో కలిసి వెళ్తున్నామని, జనసేనాని కూడా తమతో కలిసి రావాలని రెండు రోజులుగా కోరుతున్నారు.