Sabarimala Temple : 2 Women Below 50 Enter Sabarimala, Video Viral

2019-01-02 1

Two women below 50 walked into the Sabarimala temple in Kerala before daybreak on Wednesday, According to a report. Now This Video going viral.

50 ఏళ్ల లోపు మహిళా భక్తులను అయ్యప్ప ఆలయంలోకి అనుమతించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో శబరిమలలో రణ నినాదాలు మార్మోగుతూనే ఉన్నాయి. అయ్యప్ప దర్శనానికి వచ్చే మహిళలను భక్తులు అడ్డుకుంటూనే ఉన్నారు. ఈనేపథ్యంలో ఇద్దరు మహిళా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారనే వీడియో వైరల్ గా మారింది. పోలీస్ ఎస్కార్ట్ తో 40 ఏళ్ల లోపు వయసున్న కనకదుర్గ, బిందు అనే మహిళా భక్తులు తెల్లవారుజామున ఆలయంలోనికి ప్రవేశించినట్లు సమాచారం. నల్లటి దుస్తులు ధరించిన ఈ ఇద్దరు భక్తులు అర్ధరాత్రి పంబ బేస్ క్యాంప్ నుంచి బయలుదేరి స్వామి సన్నిధికి చేరుకున్నారట. తెల్లవారుజామున 3 గంటల 45 నిమిషాలకు స్వామివారిని దర్శించుకున్నట్లు సమాచారం. ఆ సమయంలో పెద్దగా భక్తజన సందోహం లేకపోవడంతో వీరికి తొందరగానే దర్శనమైనట్లు తెలుస్తోంది.

#SabarimalaTemple
#womandevotees
#Videofootage
#SupremeCourt
#purification

Free Traffic Exchange