Telangana Elections 2018 : Don't Drink And Vote, Breath Analyzers in Polling Stations? | Oneindia

2018-12-06 1,287

The Telangana Election Commission is coming up with innovative ideas to ensure smooth polling on the day of the election, on December 7. To keep away drunkards in the vicinity of the election booths, the state Election Commission is mulling over using breath analysers to check drunk voters.
తాజాగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంతో పోలింగ్ బూత్ ల దగ్గర బ్రీత్ ఎనలైజర్లు పెడుతున్నారు పోలీసులు. తాగి వచ్చి ఓటు వేయరాదనే ఈసీ నిబంధన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర క్యూలో నిలబడే ఓటర్లను బ్రీత్ ఎనలైజర్ల ద్వారా పరీక్షించనున్నారు. తాగి వచ్చేవారు ఓటు వేయొద్దనే ఈసీ నిబంధనమేరకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర బ్రీత్ ఎనలైజర్లు ఏర్పాటు చేసి లిక్కర్ తాగినవారిని గుర్తించనున్నారు. ఒకవేళ ఎవరైనా మందు సేవించినట్లు తేలితే ఓటు వేయనివ్వడమే గాకుండా వారిపై కేసు నమోదు చేయనున్నారు.
పోలీస్ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఇప్పటికే ఆయా పోలీస్ స్టేషన్లకు బ్రీత్ ఎనలైజర్లు సప్లై చేశారు. పోలింగ్ కేంద్రాల సంఖ్యను బట్టి బ్రీత్ ఎనలైజర్లు పంపిణీ చేశారు. ఎంతటివారైనా సరే లిక్కర్ తాగి పోలింగ్ కేంద్రాల దగ్గర కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీసులు. ఈసీ నిబంధనలు పరిగణనలోకి తీసుకోవాలని.. రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.
#TelanganaElections2018
#TelanganaassemblyElections
#Breathanalyzers
#ElectronicVotingMachines
#polling
#drunkvoters
#VVPAT