Tollywood director Koratala Siva has emerged as the highest earning director to be featured in 2018's Forbes India Celebrity 100 list with 20 cr Earnings.
#KoratalaSiva
#ramcharan
#jr.ntr
#tollywoodtopdirector
#tollywood
టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ సంపాదనలో ఇండియలోని టాప్ డైరెక్టర్లందరినీ మించిపోయాడు. ఇది మేము చెబుతున్న మాట కాదు... ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ బుధవారం విడుదల చేసిన జాబితా ఈ విషయం స్పష్టం చేస్తోంది. 2018 సంవత్సరంలో ఇండియాలో అధిక మొత్తంలో సంపాదించిన టాప్ 100 లిస్టులో కొరటాలకు చోటు దక్కింది. స్పోర్ట్స్, సినిమా, టెలివిజన్, మ్యూజిక్, లిటరేచర్ రంగాలకు చెందిన 100 మంది సెలబ్రిటీలతో ఈ జాబితా విడుదల చేశారు. ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న 7గురు దర్శకులకు చోటు దక్కగా... వారిలో రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ లాంటి టాప్ డైరెక్టర్లను సైతం వెనక్కి నెట్టి సంపాదనలో నెం.1గా నిలిచారు కొరటాల.