Telangana Elections 2018: కేసీఆర్ రెస్ట్ తీసుకుంటే తెలంగాణ బాగుపడుతుంది - రాహుల్ గాంధీ!!

2018-11-30 149

AICC chief Rahul Gandhi said that Telangana CM KCR will take rest after assembly elections. It was Rahul Gandhi’s target into Chief Minister K Chandrashekhar Rao, by labelling the latter's Telangana Rashtriya Samiti the BJP’s B team, while campaigning in the Telangana.
#Telanganaelections2018
#CongressManifesto
#trs
#kcr
#RahulGandhi

ఇటీవల తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఓ నిజం చెప్పారని, తాను ఓడిపోతే రెస్ట్ తీసుకుంటానని చెప్పారని, అది వాస్తవం కాబోతుందని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ అన్నారు. ఆర్మూర్, పరిగి బహిరంగ సభలలో ఆయన మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. కేసీఆర్‌ను నమ్మి ప్రజలు ముఖ్యమంత్రిగా చేస్తే, ఆయన మాత్రం అధికారంలోకి రాగానే హామీలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల పేర్లు మార్చేందుకు రూ.40వేల కోట్లు ఖర్చు చేశారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్‌తో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పగించిందని చెప్పారు. కానీ ఇప్పుడు కేసీఆర్ మాత్రం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచారని చెప్పారు.
మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ చెప్పారు. కేసీఆర్ అంటే ఖావో కమీషన్ రావు అని విమర్శించారు. ప్రతి వ్యక్తిపై రూ.1.50 లక్షలు అప్పు మోపారని ఆరోపించారు. తెలంగాణలో 1400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మండిపడ్డారు. తెరాస నేతలు దేవాలయాల భూములను సైతం కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కబ్జా భూములను స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. 17 రకాల పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పారు.

Videos similaires