TN govt wants AR Murugadoss to apologise for mocking welfare schemes. The Tamil Nadu government wants AR Murugadoss to issue an unconditional apology for criticising welfare schemes.
#sarkar
#armurugadoss
#thalapathy
#vijay
#tngovt
#kollywood
#tollywood
ఇళయదళపతి విజయ్, ప్రతిభగల దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన సర్కార్ చిత్రం ఘనవిజయం సాధించింది. వీరిద్దరి కాబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ఇది. ఓటు హక్కు దుర్వినియోగం, సెక్షన్ 49పి, రాజకీయాల్లో జరుగుతున్న కుట్రలు లాంటి ఆసక్తికర అంశాలతో మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కమర్షియల్ అంశాలతో పాటు మురుగదాస్ చెప్పాలనుకున్న సందేశం కూడా ప్రేక్షకులకు నచ్చింది. ఫలితంగా సర్కార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. అదే స్థాయిలో ఈ చిత్రాన్ని వివాదాలు కూడా చుట్టుముట్టాయి.
తమిళనాడు ప్రభత్వ పథకాలపై తీసిన సన్నివేశాలు, దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్టని దిగజార్చేలా ఉన్న సన్నివేశాల విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే.