గజ్వేల్ నియోజకవర్గంలో రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోటీ చేస్తున్న ఈ అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ తరపున (ప్రజా కూటమి) వంటేరు ప్రతాప్ రెడ్డి బరిలో నిలిచారు. కేసీఆర్ గెలుపు కోసం టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందనేది వంటేరు ప్రధాన ఆరోపణ. ఈనేపథ్యంలో సోమవారం అర్ధరాత్రి ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది.