Robo 2.O Movie Press Meet : Rajinikanth Reveals Baahubali Success Secret

2018-11-27 1,945

Robo 2.0 Press Meet is held in Hyderabad and this event is graced by Rajinikanth, Akshay Kumar, Shankar. Rajinikanth And Shankar speaking in Telugu well. Rajinikanth explained that he did not get any doubts over Shankar's capacity to deal subject of Robo 2.O
#2PointO
#Robo2.O
#Robo2.Oreview
#Robo2.OMoviePressMeet
#Rajinikanth

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాష్ కరణ్ నిర్మిస్తున్న భారీ చిత్రం '2.0'. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి 600 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ 29న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో విడుదల కాబోతోంది. సినిమా తెలుగు వెర్షన్‌ను ఎన్‌.వి.ఆర్‌. సినిమా పతాకంపై ప్రముఖ నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ దిల్ రాజుతో కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సినిమా ప్రమోషన్లో భాగంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన గ్రాండ్ ప్రెస్ మీట్‌కు రజనీకాంత్, అక్షయ్ కుమార్, శంకర్ హాజరయ్యారు. రజనీకాంత్ మాట్లాడుతూ... గతంలో రోబో సినిమా 2డిలో తీసి తర్వాత 3డిలోకి కన్వర్ట్ చేద్దామని అనుకున్నాం. దాని తర్వాత ఒక రీల్ కన్వర్ట్ చేసి చూసిన తర్వాత శంకర్ ఒకటే డిసైడ్ అయ్యాడు. 3డికి అవసరమైన సరైన సబ్జెక్ట్ దొరికినపుడే 3డి సినిమా చేయాలి, ఏదో 3డి చూపించాలని చేస్తే బావుండదని దాన్ని ఆపేశారు.