Truth is Bigg Boss 2 winner Kaushal did't get any call From PMO. Few days back Kaushal says "My father got a congratulatory phone call from the Prime Minister's Office after I was declared the winner of Bigg Boss."
బిగ్ బాస్ 2' విన్నర్ కౌశల్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. అతడికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి తెలుగు రాష్ట్రాల్లోని జనాలు ఆశ్చర్య పోతున్నారు. కేవలం ఒక టీవీ రియాల్టీ షోలో పాల్గొన్న వ్యక్తి ఇంత పెద్ద సెలబ్రిటీ స్టేటస్ సొంతం చేసుకోవడం అనేది అరుదైన పరిణామం అనే చెప్పాలి. ఇదంతా ఒకే కానీ... బిగ్ బాస్ 2 హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కౌశల్ తనకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది అని చెప్పడం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఒక ప్రైవేట్ ఛానల్‌లో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని ఒక రియాల్టీ షోలో విజేతగా నిలిచిన వ్యక్తిని ప్రధాన మంత్రి కార్యాలయం అభినందించడం ఏమిటి అనే ప్రశ్నలు మొదలయ్యాయి.