Telangana Elections 2018 : పొన్నాలకు లైన్ క్లియర్..మరి కోదండరాం మాటేంటీ ? | Oneindia Telugu

2018-11-16 272

AICC chief Rahul Gandhi confirmed Janagama ticket to former minister Ponnala Lakshmaiah.
#RahulGandhi
#PonnalaLakshmaiah
#Janagama
#marrisashidharreddy
#telanganaelections2018


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యకు జనగామ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ అంశంపై లైన్ క్లియర్ అయింది. జనగామ నుంచి తెలంగాణ జన సమితి అధినేత కోదండరాం పోటీ చేస్తారనే ప్రచారం నేపథ్యంలో పొన్నాల ఢిల్లీకి వెళ్లి పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీని కలిశారు. గురువారం రాహుల్‌ను కలిసిన పొన్నాల తన బాధలు చెప్పుకున్నారు. దశాబ్దాలుగా తాను అక్కడి నుంచి పోటీ చేస్తున్నానని, తనలాంటి సీనియర్ నేత స్థానాన్ని ఇతరులకు కేటాయిస్తే కాంగ్రెస్ కేడర్‌లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. కానీ తొలుత రాహుల్ ఆయనకు నచ్చచెప్పే ప్రయత్నాలు చేశారని తెలుస్తోంది. చివరకు శుక్రవారం నాటికి పొన్నాల ఢిల్లీలోనే ఉండి లాబియింగ్ చేసి సాధించారు. జనగామ పొన్నాలకు క్లియర్ కావడంతో కోదండరాం ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఆసక్తిగా మారింది. అసలు పోటీ చేస్తారా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది.