Virat Kohli’s Quickest 1000 T20I runs Record Has Broken

2018-11-05 122

Pakistan’s Babar Azam has broken Indian cricket team captain Virat Kohli’s record of fastest to 1000 T20I runs.
#viratkohli
#BabarAzam
#t20record
#1000T20Iruns


క్రికెట్‌లో ఉన్న అనేక రికార్డులను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బద్దలు కొడుతుంటే.... కోహ్లీ నమోదు చేసిన ఓ రికార్డుని పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజాం బద్దలు కొట్టాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు సాధించిన క్రికెటర్‌గా కోహ్లీ రికార్డుని బాబర్ అజాం తాజాగా అధిగమించాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టీ20లో బాబర్‌ అజాం 58 బంతుల్లో 78 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించాడు.