TRS Nizamabad MP Kalvakuntla Kavitha on Monday said that TRS will show on 3d screen in future.
#TelanganaElections2018
#TRS
#KCR
#KTR
#MPKalvakuntlaKavitha
#Nizamabad
#telangana
అవినీతీకి పుట్టిన కవలలే తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం మండిపడ్డారు. ఆమె జగిత్యాల జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. నాలుగేళ్ల టీఆర్ఎస్ పాలనలో ఇప్పటి వరకు ట్రయలర్ మాత్రమే చూశారన్నారు. త్రీడి స్క్రీన్ పైన అసలు సినిమా చూపిస్తామని వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో ఇదే ఆఖరి పోటీ అని చెప్పిన జీవన్ రెడ్డి ఈసారి ఎలా పోటీ చేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. 2006, 2008లలో కేసీఆర్ పైన పోటీ చేసేందుకు జీవన్ రెడ్డి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్, టీడీపీకి సెంటిమెంట్ లేవన్నారు. మహాకూటమికి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమన్నారు.