షాకింగ్.. నాగ‌చైత‌న్య‌, స‌మంత సినిమా వీడియో లీక్..!

2018-10-27 402

అవును.. న‌మ్మ‌డానికి కాస్త క‌ష్టంగా ఉన్నా కూడా ఇదే నిజం. ఈ రోజుల్లో ఓ సినిమా చేయ‌డం కంటే దాన్ని విడుద‌ల వ‌ర‌కు లీక్ కాకుండా చూసుకోవ‌డమే గ‌గ‌నంగా మారిపోతుంది నిర్మాత‌ల‌కు. ఈ మ‌ధ్య చాలా సినిమాల‌కు ఇది త‌ప్ప‌లేదు. "గీత‌గోవిందం".. "అర‌వింద స‌మేత" లాంటి సినిమాలు విడుద‌ల‌కు ముందే లీక్ అయ్యాయి. ఇప్పుడు నాగ‌చైత‌న్య‌, స‌మంత సినిమాకు కూడా ఇదే తిప్ప‌లు వ‌స్తున్నాయి. ఈ ఇద్ద‌రూ ఇప్పుడు శివ‌నిర్వాన‌ సినిమాలో క‌లిసి న‌టిస్తున్నారు. పెళ్ళి త‌ర్వాత వాళ్లు క‌లిసి న‌టిస్తోన్న తొలి సినిమా ఇదే కావ‌డంతో అంచ‌నాలు కూడా భారీగా ఉన్నాయి.
#NagaChaitanya
#Samantha
#MajiliMovie
#tollywood

Free Traffic Exchange