వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిటీ న్యూరో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఏపీ పోలీసులు ఆయన నుంచి స్టేట్‌మెంట్ తీసుకోలేకపోయారనితెలుస్తోంది. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన సమయంలో చాలామంది అభిమానులు అక్కడకు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి (చంద్రబాబు) డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ఇష్టం లేదని చెప్పారు. జగన్ కూడా స్టేట్‌మెంట్ ఇవ్వలేదు.
#YSJagan
#YSRCongressParty
#ChandrababuNaidu
#YVSubbaReddy
#telangana