Sruthi Hariharan Says No Compromise With Arjun Sarja

2018-10-26 1

విస్మయ'(కురుక్షేత్రం) సినిమా సమయంలో తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రముఖ నటుడు అర్జున్ సార్జాతో రాజీడే ప్రసక్తే లేదని, ఈ విషయంలో తాను న్యాయం పోరాటం చేయబోతున్నట్లు కన్నడ హీరోయిన్ శృతి హరిహరన్ తేల్చి చెప్పారు. గురువారం సాయంత్రం బెంగుళూరులో మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతకు ముందు కర్నాటక సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అంబరీష్ మరికొందరు పెద్దలతో కలిసి అర్జున్-శృతి హరిహరన్ మధ్య రాజీ కుదిర్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. శృతి హరిహరన్ చేస్తున్న లైంగిక వేధింపుల ఆరోపణలు అబద్దం అంటూ అర్జున్ మామయ్య రాజేష్ కర్నాటక ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేసిన అనంతరం శృతి హరిహరన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి న్యాయపోరాటానికి దిగుతున్నట్లు ప్రకటించారు.
#ArjunSarja
#SruthiHariharan
#tollywood
#kollywood